NATS: నాట్స్ సాహిత్య కార్యక్రమాలు
ఫ్లొరిడా రాష్ట్రం టాంపాలో జులై 4,5,6 తేదీల్లో నిర్వహించనున్న నాట్స్ (NATS) 8వ అమెరికా తెలుగు సంబరాల్లో తెలుగు సాహితీ వైభవానికి పట్టంకట్టే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 6వ తేదీ ఉదయం 10:30గంటలకు సినీ-గీతావతరణం పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాట ఎలా పుడుతుంది, ఎలా పురుడు పోసుకుంటుంది, ఎలా ఎదిగి ముస్తాబై మన ముందుకొస్తుంది అనే అంశంపై ప్రముఖ సినీ పాటల రచయితలు, దర్శకులు, సంగీత దర్శకుల మధ్య చర్చాకార్యక్రమాన్ని ఇందులో ఏర్పాటు చేశారు. రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, త్రిపురనేని కళ్యాణ చక్రవర్తి, డైరెక్టర్లు తనికెళ్ల భరణి, వివేక్ ఆత్రేయ, మ్యూజిక్ డైరెక్టర్ స్వరవీణాపాణిచే ఈ కార్యక్రమం జరుగుతుంది.







