67 ఏళ్ల తర్వాత అమెరికాలో మరణశిక్ష!
సరిగ్గా 67 ఏళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం ఓ మహిళకు మరణశిక్షను అమలు చేయబోతోంది. లిసా మోంట్గో మెరీ అనే మహిళకు డిసెంబరు 8న విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఈ శిక్షను అమలు చేయనుంది. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం ప్రకటించింది. చివరిసారిగా 1953 డిసెంబరు 18న బోనీ బ్రౌన్హెడీ అనే మహిళ అపహరణ, హత్య కేసుల్లో మరణశిక్షను అమలు చేశారు. 2004లో ఓ ఎనిమిది నెలల గర్భిణిని గొంతుపిసికి చంపి, అమె కడుపు కోసి గర్బంలోని శిశువును ఎత్తుకెళ్లిందన్న కేసులో లిసా మోంటిగోమెరీకి కోర్టు 2008లో మరణ శిక్ష విధించింది. కానీ, అమెరికాలో 2003 నుంచే మరణశిక్ష అమలుకావడం లేదు. మరణశిక్షల అమలును కొనసాగించాలని అక్కడి ఫెడరల్ ప్రభుత్వం గత జూలైలో నిర్ణయించింది.













