కరోనా…భయం వద్దు
కరోనా వైరస్ తో భయపడాల్సిన పనిలేదని, రెండువారాలు ఇంట్లోనే ఉంటూ మందులు వాడితే తగ్గిపోతుందని యూకే జర్నలిస్టు తోబి అకింగ్బాడే తెలిపారు. నేను 2 వారాలు ఇంట్లోనే ఉన్నాను. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నాను. నిన్ననే మెట్లు దిగి కిందకు వెళ్లాను. గార్డెన్ చూసుకున్నాను. దీర్ఘమైన శ్వాస తీసుకున్నాను. ఇదొక గుడ్న్యూస్ అవుతుందనుకుంటున్నా. అందుకే మీతో పంచుకుంటున్నా’’అంటూ అకింగ్బాడే సోషల్ మీడియాలో వెల్లడించారు. కోవిడ్-19 సోకిన వ్యక్తిని నేరుగా కలిసినందు వల్లే తనకు మహమ్మారి సోకిందని… 12 రోజులపాటు ఐసోలేషన్లో ఉండటం కష్టంగా తోచినా.. తర్వాత అంతా బాగానే గడిచిందన్నారు. కరోనా లక్షణాలు, ప్రాణాంతక వైరస్ కారణంగా ఎదుర్కొన్న బాధలు, వాటిని అధిగమించిన తీరును ట్విటర్లో పంచుకున్నారు. వైద్యుల సూచనల ప్రకారం నడుచుకున్నాను. పన్నెండో రోజుకి ఆరోగ్యవంతురాలిగా మారాను. అయితే ఇప్పుడే అంతా అయిపోలేదు. ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉండాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి బారి నుంచి బయటపడొచ్చు. నాకు 28 ఏళ్లు. ఇంట్లోనే ఉంటూ బాధ్యతగా వ్యవహరించాను. నేను కోలుకున్నాను’’ అని తోబి ట్విటర్లో పేర్కొన్నారు













