మలేరియా ఔషధానికి అమెరికా గ్రీన్ సిగ్నల్
ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ లారస్ ల్యాబ్‌కు చెందిన మలేరియా వ్యాధిని నియంత్రించే హైడ్రోక్లోరోకైన్ ట్యాబ్లెట్‌కు అమెరికా నియంత్రణ మండలి యూఎస్ఎఫ్డీఏ అనుమతినిచ్చింది. దీంతోపాటు కొన్ని స్వీయ నిరోధక వ్యాధులను నియంత్రించే మందులకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 200 ఎంజీల్లో లభించనున్న ఈ హైడ్రోక్లోరోకైన్ ట్యాబ్లెట్‌కు అమెరికా పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) తుది అనుమతినిచ్చినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. కన్కోర్డియా ఫార్మాస్యూటికల్‌కు చెందిన ప్లక్యూనిల్ ట్యాబ్లెట్‌కు జనరిక్ వెర్షన్‌గా ఈ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొన్ని రకాల మలేరియా వ్యాధులకు చికిత్స చేయడానికి ఈ ట్యాబ్లెట్‌ను వినియోగిస్తారు. దీంతోపాటు అబకేవిర్, దొలుటిగ్రేవిర్, లామివ్యూడిన్ ట్యాబ్లెట్లకు యూడా యూఎస్ఎఫ్డీఏ అనుమతించింది.













