లాటా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ‘టిక్‌టాక్ షార్ట్స్ పోటీలు’

లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘లాటా సంక్రాంతి టిక్‌టాక్ రీల్స్ షార్ట్స్ పోటీ’ నిర్వహిస్తున్నట్లు లాటా నిర్వాహకులు తెలిపారు. ఈ సార్ట్ రీల్స్‌ను 2024 జనవరి 1వ తేదీలోపు లాటాకు పంపవలసి ఉంటుంది. ఈ పోటీలో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని లాటా తెలిపింది. ఈ రీల్స్ మాత్రం కేవలం 1 నిమిషంలోపు మాత్రమే ఉండాలని షరతు విధించింది. ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకున్నా, ఇతర వివరాలు తెలుసుకోవాలని అనుకున్నా www.latausa.org/events.php లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే info@latausa.org కు మెయిల్ చేయవచ్చని, లేదా (310) 400-0370 నెంబరుకు కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చని లాటా నిర్వాహకులు వెల్లడించారు.