లాటా సంక్రాంతి సంబరాలు 2024

శ్రీరస్తూ … శుభమస్తూ… శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం … 90 వ శతకం లో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరి పెళ్లి వేడుకలో వినిపించే పాట ఇది … ఈ పాటకు ప్రాణం పోసింది శ్రీ దివ్య వాణి గారు పెళ్లి పుస్తకం చిత్రం లో …
పిసినారి భర్త, పీనాసి తనాన్ని తట్టుకోలేక ఒంటరి గా కుమారుడ్ని పెంచుతుంటే.. ఆ కుమారుడు కూడా తండ్రి కి మించిన పిసినారి అయితే ఆ తల్లి పడే వేదన, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం లో జయలక్ష్మి గా, భార్య, భర్త కన్నా ఉన్నత స్థానంలో ఉంటే కలిగే ఈర్ష్య… ఆ భార్య వాటిని ఎలా అధిగమించిందో చెప్పే రాధ గా రాధా గోపాళంలో …
బాపు గారి చిత్రాల్లో ఒక్క సారి అవకాశం వస్తేనే గొప్ప ..అలాంటిది పెళ్ళిపుస్తకం లో ఒక సాధారణ గృహిణి గా.. రాధా గోపాలం లో ఒక ఆధునిక యువతి గా.. బాపు గారి సాంప్రదాయ మరియు ఆధునిక బొమ్మ గా నిజ జీవితం లోని పాత్రలకు ప్రాణం పోసిన దివ్య వాణి గారు, “సర్దార్ కృష్ణమనాయుడు” చిత్రంతో బాలనటిగా ప్రారంభించి, బాపు బొమ్మ గా స్థిర స్థానం సంపాదించిన శ్రీ దివ్య వాణి గారు లాస్ ఏంజెలెస్ లో కనీ వినీ ఎరుగని రీతుల్లో జరిగే సంక్రాంతి 2024 సంబరాలకు ప్రత్యేక అతిధి గా రాబోతున్నారు.