కాలిఫోర్నియాలో లాటా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో ఉన్న జోర్డాన్ హై స్కూల్ వేదికగా ఈ సంబరాలు నిర్వహించాలని లాటా తెలిపింది. ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునే లాటా సభ్యులకు ఎలాంటి ఫీజు లేదు. అసోసియేషన్ నాన్-మెంబర్స్ అయితే మాత్రం కుంటుంబానికి 40 డాలర్లు, వ్యక్తులకు 20 డాలర్లు, పిల్లలకు 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంబరాల్లో భాగంగా పల్లెటూరి జాతర, వస్త్రాభరణాల స్టాల్స్, పండుగ స్పెషల్ లంచ్ మరియు డిన్నర్, బంతి భోజనాలు, పులి వేషాలు, డప్పు వాయిద్యాలు, కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.