ఘనంగా ప్రారంభమైన మొట్ట మొదటి లాటా మినీ ఒలింపిక్స్
NRI తెలుగు సంస్థల్లో అతి పెద్ద క్రీడా సంబరాలు నిన్న (మే 26) లాస్ ఏంజెల్స్ లో మొదలైనవి. ఈ సంబరాల్లో భాగంగా క్రికెట్, వాలీబాల్, ఈత, పరుగు, టెన్నిస్, చదరంగం, టెన్నికోయిట్, క్యారమ్ బోర్డు వంటి 8 క్రీడా పోటీలు నిర్వహించటం జరుగుతుంది. శాంటా క్లారిటా మేయర్ లారీన్ వెస్ట్ ముఖ్య అతిధిగా వ్యవహరించి, క్రికెట్ ఆటకి టాస్ వెయ్యటం ద్వారా మినీ ఒలింపిక్స్ క్రీడా సంబరాలను ప్రారంభించారు. మినీ ఒలింపిక్స్ క్రీడలు జూన్ నెల చివరి వరకు జరుగుతాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం లో పాల్గొనాలి అనుకునే వారు ఈ వెబ్ సైట్ లో నమోదు చేసుకోగలరు http://latausa.org/MiniOlympics
మినీ ఒలింపిక్స్ మొదటి రోజున 10 క్రికెట్ టీంలు ఫైనల్స్ లో చోటు కోసం హోరా హోరీగా పోరాడారు. మొదటి రౌండ్ క్రికెట్ పోటీలు మే 27 న సంట క్లారిట లో ముగిసి, బ్యూన పార్క్ లో జూన్ 24 న ముగుస్తాయి.
ఇంతటి స్థాయిలో క్రీడా పోటలు ఎప్పుడూ ఒక nri తెలుగు తలపెట్టలేదని అక్కడికి వచ్చిన అతిథులు కొనియాడారు. టెన్ని కోయిట్ (రింగ్ బాల్), ఈత పోటీలు, పరుగు పందాలు, టెన్నిస్, కెరమ్ బోర్డ్, చదరంగం వంటి ఆటలు ఆడవారిని, పిల్లలనీ ప్రత్యేకంగా దృష్టి లో పెట్టుకుని రూప కల్పన చెయ్యటం జరిగింది. దాదాపు 500 మంది క్రీడకారులు ఇప్పటికే రిజిష్టర్ చేసుకోవటం జరిగింది. చివరి నిమిషం వరకు వేచి వుండకుండా ముందుగానే రిజిష్టర్ చేసుకోవాలి అని మనవి చేస్తున్నారు. http://latausa.org/MiniOlympics
లాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేంద్ర కవర్తపు ఇంకా కిరణ్ గురురాజ్, ఫణి పన్నపలి మరియూ చాలా మంది స్వచ్చంధ సేవకులు కలిసి ఈ ప్రారంభ వేడుకలను మరియు సంటా క్లారిట లో క్రికెట్ క్రీడలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు లాటా అధ్యక్షులు హరి మాదాల స్వచ్చంధ సేవకులకూ, క్రీడాకారులకూ, సభ్యులకూ, అతిథుల కూ, స్పాన్సర్లు కూ దన్యవాదముు తెలిపారు. లాటా కోశాధికారి సూర్య దామోదర, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నెక్కంటి విజయ భాస్కర్, సురేష్ అంబటి మరియు కృష్ణా రావు అల్లపర్తి కూడా ఈ వేడుకల్లో భాగం పంచుకున్నారు.
క్రీడాకారులు / జట్టులు మినీ ఒలింపిక్స్ లో పాల్గొనాలి అంటే ఇక్కడ నమోదు చేసుకొనగలరు. http://latausa.org/MiniOlympics













