చైనా దురాక్రమణలకు పాల్పడుతున్నది : మైక్ ఎనానీ
భారతదేశ సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో బీజింగ్ దురాక్రమణలో భాగమేనని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం భారత్, చైనాల మధ్య ఏర్పడిన పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కైలీ మెక్ ఎనానీ వెల్లడించారు. ఇరు దేశాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తాము మద్దతిస్తామని చెప్పారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాలను ఆక్రమించడానికి చైనా ప్రయత్నిస్తుందనడానికి భారత సరిహద్దుల్లో దూకుడు వైఖరి నిదర్శమని అధ్యక్షుడు ట్రంప్ అన్నారని ఆమె తెలిపారు. ఈ చర్యలు చైనా కమ్యూనిష్టు పార్టీ నిజస్వభావాన్ని నిర్ధారిస్తాయన్నారు.













