సురక్షిత ప్రాంతాలకు టెక్సాస్ వాసులు
సుమారు 50 మందిని బలిగొన్న టెక్సాస్ వరదల నుంచి స్థానిక ప్రజానీకాన్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 1,85,000 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అవడంతో స్థానికులంతా పునరావాస కేంద్రాలకు తరలుతున్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో సుమారు 42,000 మంది ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. హ్యూస్టన్ పరిసర ప్రాంతాల నుంచి నీటి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాధితులకు తాత్కాలిక నివాసం, ఆహారం అందజేస్తున్నట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకంగా మరిన్ని బలగాలను రంగంలోకి దింపినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబౌట్ మీడియాకు వెల్లడించారు.













