తుది దశకు శ్రీనివాస్ కూచిబొట్ల హత్య కేసు విచారణ
అమెరికాలో దారుణహత్యకు గురైన శ్రీనివాస్ కూచిబొట్ల కేసులో విచారణ తుది దశకు చేరింది. జాత్యాహంకార దాడికి పాల్పడినట్లు కాన్సాన్కు చెందిన నిందితుడిపై అభియోగాలు నమోదు చేశారు. ఫిబ్రవరి 22న కాన్సాస్ సిటీ బార్లో శ్రీనివాస్ హత్య చేసి మరో ఇద్దరిని నిందితుడు ఆడమ్ పురింటన్ గాయపరిచాడు. ఈ కేసులో నిందితునికి ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది. మా దేశం విడిచి వెళ్లండి అంటూ బిగ్గరగా అరుస్తూ నిందితుడు కాల్పులు జరిపినట్లు ఈ కేసులో ప్రత్యకక్ష సాక్షి కోర్టుకు తెలిపాడు. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిబోట్ల ప్రాణాలు కోల్పోగా మరో ప్రవాససుడు ఆలోక్ మాదసాని గాయపడ్డారు. వీరిని కాపాడేందుకు యత్నించిన 24 ఏళ్ల అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా గాయపడిన విషయం తెలిసిందే.













