ఎన్నారై శాఖకు వంద కోట్లు..ఆనందోత్సవాలలో ఎన్నారైలు
న్యూజెర్సీ లో తెలంగాణ అస్సోసియేషన్స్ రాష్ట్ర బడ్జెట్లో ఎన్నారై శాఖకు వంద కోట్లు కేటాయించనందుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
ఈ సభలో తెలంగాణ ఎన్నారైలు వందల సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బిగాల మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విదంగా తెరాస ప్రభుత్వం ఎన్నారైలకు ముఖ్యంగా గల్ఫ్ బాధితులకు అండగా ఉంటుంది. గత కాంగ్రెస్, బీజేపీ ప్రభత్వాలు అయిదు కోట్లే కేటాయిస్తుండె కానీ తెరాస ప్రభుత్వం లో కెసిఆర్ గారు ఈ సంవత్సర బడ్జెట్ లో వందకోట్లు కేటాయించండం చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు. ఈ నిధి తో గల్ఫ్ లో ఉన్న తెలంగాణ వాదుల కష్టాలు తీరబోతున్నాయి అన్నారు. ఎస్సి, ఎస్టీ లకే కాకుండా అన్ని వర్గలా విద్యార్థులకు ఇరవై లక్షలు లోన్ ఇవ్వడమనేది అత్యాద్భుతం అన్నారు. త్వరలోనే ఇండియాకి వెళ్ళాక కెసిఆర్ గారిని మరియు కేటిర్ గారిని కలిసి అందరు ఎన్నారైల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతామన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గనగోని, రవి ధన్నపునేని, మహేష్ పొగాకు, దేవేందర్ రెడ్డి, టి ర్ స్ యు ఎస్ ఏ సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు.













