ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో పలు దేశాల్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆయా దేశాల్లోని శాఖలను సమన్వయం చేశారు. యూరప్‌లోని నార్వేలో యేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కోశారు. మరో వైపు వీరి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదానం చేశారు. గల్ఫ్‌లోని ఖతార్‌లో ఆశాఖ అధ్యక్షుడు అబ్బగోని శ్రీధర్ ఆధ్వర్యంలో, మాల్దీవులు అధ్యక్షుడు రాకేశ్, నరేంద్ర ఆధ్వర్యంలో కేక్ కోశారు. టీఆర్ఎస్ ఎన్నారై యూకే సెల్ మాజీ ఉపాధ్యక్షుడు శానబోయిన రాజ్ ఆధ్వర్యంలో నర్సంపేటలో చీరెలు పంచారు. కార్యదర్శి చాడ సృజన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ మైత్రి అనాథాశ్రమంలో అన్నదానం చేశారు.













