తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి కొండా మోహన్ ఎంపిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆజాదీకా అమృత మహోత్సవ ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లు జిల్లా వలిమిడి గ్రామంలోని పుట్టి హైదరాబాద్‌లోని జలమండలిలో డిస్ట్రిక్ ఫారెస్టు ఆఫీసర్‌గా డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న కవి, రచయిత కొండా మోహన్ ఎంపికయ్యారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో జూమ్‌లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద కొండా మోహన్ తమ కవితను వినిపించబోతున్నారు. ప్రపంచ యువనికపై దేశం గొప్పతనాన్ని ప్రపంచం కళ్లు తెరవకముందే నాగరికత ఎలా పరిఢవిల్లినదో చాలా అద్భుతంగా వివరించిన వసుదైక కుటుంబకం అనే కవిత ఈ పోటీలో ఎంపికైంది.













