న్యూజెర్సీలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో మీట్ అండ్ గ్రీట్
37 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్తమే కాదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. న్యూజెర్సీలో తెలుగుదేశం కార్యకర్తలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగజాతి ఆత్మగౌరవం నుంచి ఆవిర్భవించిన టీడీపీని ఖాళీ చేయడం ఎవరితరం కాదని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో బీజేపీ, వైసీపీలు కలసి మైండ్‌గేమ్‌లతో దుష్ప్రచారం చేసి గెలిచారన్నారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ 40 శాతం ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకొన్నామని, వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రలోభాలకు లొంగి కొందరు నేతలు వెళ్లిపోయినా లక్షలాది మంది కార్యకర్తల అండ టీడీపీకి ఉందని తెలిపారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడాల్సిన పనిలేదని, వారిని అన్నా విదాల పార్టీ కాపాడుకుంటుందని అన్నారు. గత ఎన్నికల్లో ఎన్ఆర్ఐల సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు సుఖవాసి శ్రీనివాస్, శ్రీహరి మందాడి, వంశీ వెనిగళ్ల, మోహన్ కుమార్ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, చంద్ర కొణిదెల, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి తదితరులు పాల్గొన్నారు.













