TSN: నెబ్రాస్కా తెలుగు సమితి అధ్యక్షుడిగా కొల్లి ప్రసాద్

ఓమాహా హిందూ టెంపుల్ కమ్యూనిటీ సెంటర్‌లో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) నూతన కార్యవర్గం 2025-2026 ఆవిష్కరణ సమావేశం ఘనంగా జరిగింది. సమావేశాన్ని జనరల్ సెక్రటరీ శ్రీ తాతా రావు ప్రారంభించి, హాజరైన తెలుగు ప్రజలను ఆహ్వానిస్తూ స్వాగత ప్రసంగం అందించారు. అనంతరం టిఎస్ ఎన్ ప్రస్తుత అధ్యక్షుడు రాజా కోమటిరెడ్డి 2024-25లో నిర్వహించిన సేవా-సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. కోశాధికారి సాంబా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ-వ్యయ వివరాలు సమర్పించారు. ఈవెంట్ వైజ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ను అద్భుతమైన ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం సభ్యులు బైలాస్ సవరణలు, భవిష్యత్తు కమిటీలలో సభ్యత్వ ఆసక్తి, మరియు సమితి అభివృద్ధికి సూచనలు పంచుకున్నారు.
తదుపరి నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఎన్నికలు జరిగాయి. శ్రీ సుందర్ నూతన అధ్యక్షుడిగా శ్రీ కొల్లి ప్రసాద్ (Kolli Prasad) ను ప్రతిపాదించగా, హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే ఇతర పదవులకూ కొత్త సభ్యులను ఎంపిక చేయడం, కొంతమంది ప్రస్తుత సభ్యులను తదుపరి స్థాయికి ప్రమోట్ చేయడం జరిగింది.
2025-2026 నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా తాతారావు, కోశాధికారిగా అలగన్, సాంస్కృతిక కార్యదర్శిగా రమ్య రావిపాటి, కోశాధికారిగా దివులా సాంబా, సహాయ కోశాధికారిగా పంగా యుగంధర్, ఇతర కార్యవర్గ సభ్యులుగా పోతినేని అనిల్, అవినాష్, గొట్టిపాటి ధన, రాయపాటి రమేష్, ముప్పరాజు వీరేంద్ర, కమిరెడ్డి బాల, బోర్డు సభ్యులుగా లక్ష్మీ మాధురి, మురకొండ వేణుగోపాల్, అనూప్, నీలిమ, చైతన్య రావిపాటిలు ఎన్నికయ్యారు.
సమితి అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేస్తామని సభ్యులు తెలిపారు. సత్యనారాయణ పావులూరి, మురళీధర్ చింతపల్లి, ఫణి అడ్డిదాం, సుందర్ చుక్కరా, సోము కొడాలి, మహేష్, శరత్ బొడేపూడి, మైనేని కామేశ్వరరావు, శ్రీనివాస్ రావుల, ప్రసాద్ కందిమళ్ల, ఆదిబాబు, వేణు పొతినేని, నవీన్ కంటం తదితరులు పాల్గొన్నారు.
సమావేశం ముగింపులో ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ రాజా కోమటిరెడ్డి నూతన అధ్యక్షుడు శ్రీ కొల్లి ప్రసాద్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సమితి అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని ఆకాంక్షించారు. గత 15 ఏళ్ల సంఘం చరిత్రలో ఈ సార్వత్రిక సమావేశంలోనే అత్యధిక హాజరు నమోదైంది. ఈ కార్యక్రమానికి గత అధ్యక్షులు మరియు ప్రముఖులు సత్యనారాయణ పావులూరి, మురళీధర్ చింతపల్లి, ఫణి అడ్డిదాం, సుందర్ చుక్క, సోము కొడాలి, మహేష్ మరియు శరత్ బొడేపూడి, మైనేని కామేశ్వరరావు, శ్రీనివాస్ రావుల, ప్రసాద్ కండిమల్ల, ఆది బాబు, వేణు పొతినేని, నవీన్ కంటం మరియు మరెందరో ఈ కార్యక్రమానికి విచ్చేసి కొత్త కమిటీకి అభినందనలు అందించారు.