లాటా సంక్రాంతి సంబరాల్లో ‘కైట్స్ ఫెస్టివల్’కు ముహూర్తం ఖరారు

లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇక సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. అలాంటప్పుడు గాలిపటాలు ఎగరేయకుండా సంక్రాంతి జరుపుకోలేం కదా. అందుకే లాటా కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ‘కైట్ ఫెస్టివల్’ నిర్వహిస్తోంది. జనవరి 6వ తేదీ, శనివారం నాడు ఇర్విన్, ఈస్ట్‌వేల్, సైప్రస్, టోరన్స్‌లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ మరుసటి రోజున అంటే జనవరి 7వ తేదీ, ఆదివారం నాడు శాంటా క్లారిటాలో కైట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పతంగుల పండుగలో రిజిస్టర్ చేసుకోవాలన్నా, అలాగే మరిన్ని వివరాలు కావాలన్నా www.latausa.org/events.php వెబ్‌సైటులో తెలుసుకోవచ్చు.