ఆటా 2024 కాన్ఫరెన్స్ కన్వీనర్‌గా కిరణ్ పాశం
అమెరికా తెలుగుసంఘం (ఆటా) 2024లో అట్లాంటాలో నిర్వహించే మహాసభలకు, యూత్ కన్వెన్షన్‌కు కన్వీనర్‌గా కిరణ్ పాశం నియమితులయ్యారు. నేషనల్ కో ఆర్డినేటర్‌గా సాయి సూదిని, శ్రీధర్ తిరుపతి కో ఆర్డినేటర్‌గా, అనిల్ బొద్దిరెడ్డి కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా కూడా నియమితులయ్యారు. వీరి నియామకం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణారెడ్డి అల, ట్రజరర్ శరత్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఆర్ ఎర్రం రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేష్ బుజాలా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి ప్రసాద్ లింగాల తదితరులు కాన్ఫరెన్స్ కమిటీ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ 2024 అట్లాంటా కాన్ఫరెన్స్ సంపూర్ణంగా విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.













