డిటిఎ అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్
డిట్రాయిట్ తెలుగు సంఘం (డిటిఎ) అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు డిటిఎ ఎన్నికల సంఘం ప్రకటించింది. యూకె నుండి 2008లో పెన్సిల్వేనియా వచ్చిన కిరణ్, 2012 నుండి మిషిగన్లో నివసిస్తున్నారు. తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలందించిన ఆయన నందమూరి బాలకృష్ణ వీరాభిమానిగా అమెరికాలో సుపరిచితులు. అధ్యక్షుడిగా ఎన్నికైన కిరణ్ కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ముదునూరుకు చెందిన వ్యక్తి. 1976లో ఏర్పాటు చేసిన డెట్రాయిట్ తెలుగు సంఘం 2021 ఎన్నికలకు ఈ ఏడాది అధ్యక్ష, కార్యదర్శ, కోశాధికారి పదవులకు మూడు నామినేషన్లు మాత్రమే వచ్చాయని, కావున వీరి ముగ్గురినీ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధ్యక్షుడు నెరుసు సత్యం, కార్యదర్శి వేణులు ప్రకటించారు. నూతన కార్యదర్శిగా ఇంజేటి సత్య, కోశాధికారిగా ఒమ్మి ఉమా మహేశ్వరరావులు ఎన్నికయ్యారు.













