అమెరికా చేరుకున్న ఖషోగ్గీ పెద్ద కుమారుడు
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వాషింగ్టన్ కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ కుమారుడిని అమెరికా పంపించేందుకు సౌదీ ఎట్టకేలకు ఒప్పుకొంది. దీంతో అతడు అమెరికాకు చేరుకున్నాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా-సౌదీల పౌరసత్వం కలిగి ఉన్న ఖషోగ్గీ కుమారుడు పెద్ద కొడుకు సలా జమాల్ ఖషోగ్గీ పాస్‌పోర్టును సౌదీ అధికారులు సీజ్ చేశారు. దీంతో గత కొన్ని నెలలుగా అతడు రియాద్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రి మరణం తర్వాత కూడా అమెరికా వెళ్లేందుకు అతడికి అనుమతి లభించలేదు. ఈ విషయమై అమెరికా విదేశాంగ అధికారులు మాట్లాడుతూ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సలా పాస్‌పోర్టును పునరుద్ధరించాల్సిందిగా కోరారు. ఇందుకు సౌదీ విదేశాంగ అధికారులు సానుకూలంగా స్పందించారు. సలా ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.













