అమెరికాలో భారత దౌత్య కార్యాలయంపై…
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్ పై దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుండగులు దౌత్య కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడినవారి సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు. అమెరికా అధికార ప్రతినిధి ఈ దాడిని ఖండిరచారు. ఘటనకు కారకులైన వారిపై కఠన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఐదు నెలల్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. గత మార్చి నెలలోనే ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడి చేశారు.






