భారత సంతతి వ్యక్తికి అమెరికాలో … జీవిత ఖైదు
కత్తితో 17 సార్లు పొడిచి భార్యను చంపిన భారతీయ వ్యక్తికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడు జీవితాంతం జైలు జీవితం గడపనున్నాడు. ఈ నెల 3న ఈ మేరకు కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయబోనని నిందితుడు చెప్పడంతో మరణ శిక్ష తప్పినట్లు ప్రభుత్వ న్యాయవాది కార్యాలయం పేర్కొంది. 2020లో ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ హెల్త్ కోరల్ స్ప్రింగ్స్ హాస్పిటల్లో 26 ఏళ్ల మెరిన్ జాయ్ నర్సుగా పనిచేసింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త ఫిలిప్ మాథ్యూ అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పార్కింగ్ వద్ద ఆమె కారును తన కారుతో అడ్డుకున్నాడు. ఆపై కత్తితో 17 సార్లు ఆమెను పొడిచాడు. తీవ్ర గాయాలతో నేలపై పడిన భార్య మీదుగా కారున నడిపి పారిపోయాడు.













