డేటా అనలిటిక్స్‌లో అద్భుత అవకాశాలు
డేటా అనలిటిక్స్‌లో నేటితరం యువతీ యువకులకు అద్భుతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, భారత యువత నేడు ఈ రంగంలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరీన్ బి.హడ్డా పేర్కొన్నారు. ఐఎస్బీ బిజినెస్ అనలిటిక్స్ వర్టిఫికేట్ ప్రోగ్రాం గ్రాడ్యుయేషన్ డే వేడులకు గచ్చిబౌబిలోని ఐఎస్బీ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 2018 లెక్కల ప్రకారం డేటా అనలిటిక్స్‌లో ఉద్యోగాల కల్పనలో భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని, యూఎస్ ఈ రంగంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ సందర్భంగా సీబీఏ గోల్డ్‌మెడల్‌ను విక్రం దేవతా, సిల్వర్ మెడల్‌ను సమీర్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ.రామభద్రన్ తిరుమళై, ప్రొ.ఆనంద్, ప్రొ.సహాలు పాల్గొన్నారు.













