ట్రంప్ నాతో అఫైర్ నడిపారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో లైంగిక సంబంధం ఉన్నట్లు మరో మహిళ మీడియా ముందుకు వచ్చింది. ప్లే బాయ్ మోడల్ (మాజీ) అయిన కరెన్ మెక్‌డౌగల్(46) ట్రంప్ తనతో శారీరక సంబంధం నెరిపినట్లు ఆరోపిస్తోంది. 2006లో ట్రంప్ తనతో ఆఫైర్ కొనసాగించారని, అదే సమయంలో ట్రంప్ భార్య మెలానియా కొడుక్కి జన్మనిచ్చిందని మెక్‌డౌగల్ తెలిపింది. తొమ్మిది నెలల పాటు వారి సంబంధం కొనసాగిందన్న ఆమె, 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా ట్రంప్ డబ్బుతో ఒప్పందం చేసుకున్నాడంటూ పేర్కొంది. మెక్‌డౌగల్ ఇంటర్వ్యూను న్యూ యార్కర్ అనే పత్రిక తాజాగా ప్రచురించటంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. లక్షా 50,000 డాలర్లతో ఈ ఒప్పందం జరిగిందని ఆ కథనం వివరించింది. అయితే గతంలోనే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఈ వార్తపై స్పందించేందుకు వైట్ హౌజ్ నిరాకరించింది.













