హైదరాబాద్ త్వరలోనే బెంగళూరును అధిగమిస్తుంది
పెట్టుబడుల్లో హైదరాబాద్ నగరం త్వరలో బెంగళూరును అధిగమిస్తుందని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు, అమెరికాలోని సిలికాన్‌వ్యాలీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కన్వల్రేఖి అన్నారు. ఆయన హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారు చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, టీహబ్, వీహబ్ ఇతర ప్రాజెక్టుల గురించి కేటీఆర్ ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా కన్వల్ తెలంగాణ పురోగతిని, ప్రభుత్వ విధానాలను, టీహబ్‌ను ప్రశంసించారు. డైనమిక్ లీడర్ కేటీఆర్ దీనిని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దారన్నారు.













