సూక్ష్మజీవులతో ప్రమాదం … క్యాన్సస్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్
జీవ వైవిద్యం దెబ్బతినడమే ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమని అమెరికాలోని క్యాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ సుస్థిర సాంద్ర ఆవిష్కరణ ప్రయోగశాల సంచాలకుడు డాక్టర్ పీవీ వరప్రసాద్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో అంతర్గతంగా నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా నుంచి ఆన్లైన్లో ఆయన ప్రసంగించారు. కరోనా లాగే వ్యవసాయరంగంలోనూ ప్రమాదకర సూక్ష్మజీవులతో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన పలువురికి అవార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు, డాక్టర్ సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.













