శ్రీనివాస్ కూచిభొట్లను కాపాడబోయిన హీరోకు అరుదైన గౌరవం
కాన్సాస్ కాల్పులో భారతీయులను కాపాడబోయిన ఇమాన్ గ్రిల్లోట్కి అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ ప్రతిఏటా ప్రకటించే సాహసవీరుల జాబితాలో ఆయన పేరును కూడా ప్రకటించింది. 2017లో మనలో ఆశలు నింపిన 5 గురు హీరోలు అంటూ టైమ్ మ్యాగజైన్ ఓ జాబితాను విడుదల చేసింది. భారత యువకులు శ్రీనివాస్ కూచిభొట్ల, ఆయన స్నేహితుడు అలోక్ మాదసానిపై ఓ మాజీ నేవీ ఉద్యోగి కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శ్రీనివాస్ మృతిచెందగా, అలోక్ ప్రాణాలతో బయటపడ్డారు. కాల్పులకు తెగబడిన ఉన్నాదిని అడ్డుకునేందు 24 ఏళ్ల అమెరికా యువకుడు గ్రిల్లోట్ ప్రాణాలకు తెగించాడు. ఈ క్రమంలో అతడి చాతీలోకి ఓ బుల్లెట్ కూడా దూసుకెళ్లింది. అక్కడ నేనేమీ చేయకుండా ఉండిఉంటే, నేను నేనుగా బ్రతకలేకపోయేవాడిని అని గ్రిల్లోట్ పేర్కొన్నారు.













