భారతీయులకు కమలా హారీస్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో ఉన్న డెమోక్రటిక్ పార్టీ నేత కమలా హారిస్ భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్-అమెరికా సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉపాధ్యక్ష పదవికి నామినేట్ అయిన తొలి దక్షిణాసియాకు చెందిన వ్యక్తిగా ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు మీముందుకు వచ్చానని సభికులతో చెప్పారు. గడిచిన దశాబ్దాల్లో భారత్ సాధించిన పురోగతి ప్రస్తుతం ప్రతిబింబిస్తున్నదన్నారు. మరింత మంచి భవిష్యత్ జాతి నిర్మాణానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్న హీరోల విజయగాథలను చిన్నతనంలో చెన్నై బీచ్లో నడుస్తూ తన తాతగారి ద్వారా తెలుసుకున్నట్టు తెలిపారు.













