అధిక బరువున్న వారిలో కరోనా మరణాలు ఎక్కువ
అధిక బరువు లేదా బాడీ మాస్ ఇడెక్స్ (బీఎంఐ) అధికంగా ఉన్నవారిలో కరోనా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని అమెరికాకు చెందిన పరిశోధకులు తాజాగా పేర్కొన్నారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు సృష్టం చేశారు. కైసర్ పెర్మనెంట్ సదరన్ కాలిఫోర్నియా హెల్త్‌కేర్ సిస్టమ్‌లోని పరిశోధకులు ఈ మేరకు తమ అధ్యయనాన్ని చేసినట్లు తెలిసింది. దాని ప్రకారం 6900 మందికి పైగా రోగుల ఆరోగ్య రికార్డుల్ని పరిశీలించిన మీదట అధిక బరువు కలిగిన వారు కరోనా సోకిన 21 రోజుల్లో కన్నుమూసే ప్రమాదం ఉన్నట్లు తేలింది.













