మలేసియాలో గుండె పోటుతో కడప జిల్లా వాసి మృతి
తెరాస మలేషియా సహాయంతో భౌతికకాయం హైదరాబాద్ తరలింపు.
ఉపాధి కోసం ఏడు నెలల క్రితం మలేషియాకి వెళ్లి అక్కడి ఫ్యాక్టరీ లో పని చేస్తూ గుండె పోటుతో కడప జిల్లా ప్రొద్దటూరు మండల కేంద్రానికి చెందిన ముద్దం సంజీవ రాయుడు (43) మృతి చెందినట్లు తన సహచరుడు ఫోన్ చేసి తెరాస మలేషియా ప్రెసిడెంట్ చిట్టి బాబు గారికి సమాచారం అందించడం జరిగింది. వెంటనే స్పందించిన చిట్టి బాబు గారు వైస్ ప్రెసిడెంట్ కుర్మ మారుతి, జనరల్ సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు మృతదేహానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్ నుండి మరియు కుటుంబ సభ్యులనుండి కావాల్సిన అసైన్మెంట్ డాకుమెంట్స్ తీసుకొని ఇండియన్ హై కమిషన్ కి చేరవేసి భౌతిక కాయం త్వరగా స్వస్థలానికి చేరుకునేలా చేసారు.
దీనికి సంబందించిన డాకుమెంట్స్ కొరకు వారి అన్నయ్య ముద్దం సుబ్బారాయుడు, గ్రామ వాసి ఉప్పలూరు వీరశేఖర్ గారి సహాయం తీసుకొని ఒక్క రోజులో తెరాస మలేషియా డాక్యుమెంటేషన్ ను పూర్తిచేసి ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా భౌతిక కాయాన్ని ఇండియా పంపడానికి అన్ని విధాలా సహాయం అందించింది. భౌతిక కాయం శనివారం రోజు రాత్రి 11 గంటల 30 నిముషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది.













