అమెరికాలో భారత మిత్రుడు కన్నుమూత
భారత్‌కు చిరకాల మిత్రుడు, అమెరికా రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందిన చట్టసభ సభ్యుడు జాన్ మెక్కెయిన్(81) కన్నుమూశారు. గ్లియోబ్లాస్టోమా అనే బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఏడాది కాలంగా కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నారు. అరిజోనా రాష్ట్రం నుంచి ఆరోసారి సెనేటర్‌గా ఎన్నికైన ఆయన అమెరికా రాజకీయ చిత్రపటంలో గొప్ప రాజనీతిజ్ఞునిగా పేరుపొందారు. వియత్నాం యుద్ధ వీరునిగా గుర్తింపు ఉన్నది. సొంత పార్టీకి చెందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మెక్కెయిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తన అంత్యక్రియలకు అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించొద్దని ఆయన కోరినట్టు సమాచారం.













