లేటు వయసులో.. ఒకటైన జంట
జాన్ కుక్, ఫిల్లిస్ కుక్‌లు అమెరికాలోని ఒహాయోలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఏడాది నుంచి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వారి మనసులూ కలిసాయి. ఒకరికోసం ఒకరని నిర్ణయించుకున్నారు. వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ వయసులో పెండ్లేంటి? అని చాలామంది హేళన చేశారు. కానీ వారిద్దరూ మాత్రం ఎవరి మాటలనూ పట్టించుకోలేదు. వయసు మీద పడిన తర్వాత కావాల్సింది తోడూ, నీడేనని అందుకోసమే పెండ్లి చేసుకున్నామని కుక్ దంపతులు చెబుతున్నారు. భాగస్వాములను కోల్పోయి ఇక్కడకు చేరామని ఒకరిపై ఒకరికి ఇష్టంతో ఒకటయ్యామని అంటున్నారు. మిగతా వాళ్ల అభిప్రాయాలతో తమకు సంబంధం లేదంటున్నారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతామని చెబుతున్నారు. ఒకరికొకరు తోడూ నీడగా జీవిస్తున్నారు. ఈ దంపతుల పెండ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అందరూ వారి వివాహబంధాన్ని ఆమోదించడం విశేషం.













