అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు … తప్పిన ముప్పు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ డెలావర్‌లోని విల్మింగ్టన్లో ఉన్న తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ వద్దకు వస్తున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్‌లోని యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగినప్పుడు జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండటా. ప్రెసిడెంట్ బైడెన్ 130 అడుగుల దూరంలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయను అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైట్‌హౌస్‌కు తరలించారు. దంపతులిద్దరు క్షేమంగా ఉన్నారని అధ్యక్ష భవన వర్గాలు వెల్లడిరచారు. ఘటనకు పాల్పడిన డ్రైవర్‌ను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.













