ముందే ఓటు హక్కు వినియోగించుకున్న డెమొక్రాటిక్ అభ్యర్థి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి స్వస్థలం డెలావేర్లోని విల్మింగ్టన్లో ఓటేశారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తరహాలోనే ముందస్తుగా తన ఓటును నమోదు చేశారు. ఓటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన బైడెన్ ఎన్నికల్లో గెలిస్తే రిపబ్లికన్లతోనూ కలిసి పనిచేస్తానని చెప్పారు.
చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు….
నవంబరు 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డు సృష్టించనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు లక్ష కోట్లకు పైగా (1400 కోట్ల డాలర్లు) ఖర్చు కానున్నట్టు సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ అనే పరిశోధన సంస్థ వెల్లడించింది. ఇది గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే దాదాపు రెట్టింపు.













