జో బైడెన్ సలహాదారుల్లో ఇద్దరు భారతీయ అమెరికన్లు
డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సలహా బృందంలో ఇద్దరు భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. వీరిలో ఒకరు డాక్టర్ వివేక్ముర్తి కాగా, మరొకరు రాజూశెట్టి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, వాతావరణ మార్పులకు సంబంధించి విధాన రూపకల్పనలో వీరిద్దరిదీ కీలకపాత్ర అని ఆ పత్రిక తెలిపింది. వివేక్‌మూర్తి ఒరాక్ ఒబామా హయాంలో అమెరికా సర్జన్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వివేక్‌తోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ ఛీప్ డాక్టర్ డేవిడ్ కెస్లర్ రూపొందించే నివేదికే బిడెన్ విధానపర నిర్ణయాలకు ఆధారం కానున్నది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన రాజూశెట్టి ఆర్థిక అంశాల్లో బైడెన్‌కు సలహాదారుగా వ్వవహరిస్తున్నారు.













