ఎల్ చాపోనకు అమెరికాలో జీవిత ఖైదు
మెక్సికోకు చెందిన కరుడుగట్టిన కొకెయిన్ స్మగ్లర్ జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్ (62)కు అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టు జీవితఖైదు విధించింది. సొరంగాలు తవ్వి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేయడం, హత్యలు చేయించడం, లంచాలు ఇవ్వడంలో సిద్ధహస్తుడిగా చాపో పేరుపొందాడు. మెక్సికోలో గ్యాంగుల ముఠా పహారాలో ఉండే అతడిని అమెరికా అధికారులు గట్టి బందోబస్తు మధ్య తీసుకొచ్చారు. మెక్సికో జైళ్ల నుంచి రెండు సార్లు తప్పించుకొని పారిపోయిన సంఘటనలు ఉండడంతో, అతడిని ఇక్కడ ఏకాంతంగా బంధించారు. గత 25 ఏళ్లుగా అతడు టన్నుల కొద్దీ కొకెయిన్ను అమెరికా అక్రమంగా తరలించినట్టు రుజువైంది.













