ఉపాధ్యాయుల సమ్మె తో పునఃప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన అరిజోనాలోని విద్యా సంస్థ
సోమవారం 17 ఆగస్టు నుంచి అరిజోన లో ని జె.ఓ. కొమ్బ్స్ యూనిఫైడ్ విద్యా సంస్థ. ఇన్-పర్సన్ విద్యా బోధనను ప్రారంభించాల్సి ఉండగా ఉపాధ్యాయుల నిరసన తో విద్యా సంస్థ తిరిగి తెరవడానికి రూపొందించిన ప్రణాళికలను రద్దు చేసినట్లు తెలిసింది.
ఏడు శాఖలు కలిగి ఉన్న జె.ఓ. కొమ్బ్స్ యూనిఫైడ్ విద్యా సంస్థ ఇన్-పర్సన్ విద్యా బోధనను ప్రారంభించటానికి అరిజోనా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచించిన నియమ నిబంధనలు పూర్తి చేయకుండా సోమవారం 17 ఆగస్టు నుంచి ఇన్-పర్సన్ విద్యా బోధనను ప్రారంభించటానికి కార్యాచరణ సిద్ధం చేయగా ఆ విద్యా సంస్థ కు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ఆరోగ్య దృష్ట్య ఇన్-పర్సన్ విద్యా బోధనను వాయిదా వేయాలి అని నిరసన వ్యక్తం చేయటంతో , జె.ఓ. కొమ్బ్స్ యూనిఫైడ్ విద్యా సంస్థ సూపరింటెండెంట్ గ్రెగొరీ ఎ. వైమన్ శుక్రవారం 14 ఆగష్టు న, ఆరోగ్యం మరియు భద్రతా సమస్యల దృష్ట్య సోమవారం 17 ఆగష్టు న అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కానందున సెమిస్టర్ ప్రారంభించడానికి రూపొందించిన ప్రణాళిక లు నిలిపివేస్తున్నట్లు అంతేకాక వర్చువల్ క్లాసులు కూడా ప్రస్తుతానికి రద్దు చేయబడ్డాయి అని మరియు పునఃప్రారంభం తేదీ ఇంకా నిర్ధారించలేదు అని ఆన్లైన్ ద్వారా విద్యా సంస్థ సిబ్బందికి మరియు విధ్యార్దుల తల్లితండ్రులకి అధికారికంగా తెలియజేసినట్లు తెలిపారు.













