ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి కిమ్ రాజీనామా
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జిమ్ యోంగ్ కిమ్ ప్రకటించారు. ఫిబ్రవరి 1న పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కిమ్ వెల్లడించారు. ఆరేళ్లుగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతూ వస్తున్న కిమ్ ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి ఐక్యరాజ్య సమితి అమెరికన్ పౌరుడినే ఎంపిక చేస్తూ వస్తోంది. ప్రపంచ బ్యాంక్‌కు సారథ్యం వహించటం తనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని కిమ్ పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 1న ప్రపంచ బ్యాంక్ సీఈఓ క్రిస్టలీ నా జార్జియోవా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.













