టెక్ 2017 సదస్సులో ప్రసంగించిన జయరామ్ కోమటి
వైజాగ్లో జరిగిన మూడురోజుల టెక్ సదస్సు 2017లో అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఎపిఎన్నారై, జన్మభూమి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికకు పెద్దపీట వేసేలా ప్రతి పాఠశాలలోనూ డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యావవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ఇలాంటి సదస్సులు దోహదపడుతాయని తెలిపారు. ముగింపు సభలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రసంగించారు. ఈ సందర్భంగా యునెస్కో ఎంజిఐఇపి విభాగం డైరెక్టర్ అనంత దురయప్ప మాట్లాడుతూ విద్యను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్ది విద్యార్థుల్లో మానవీయ విలువల పెంపునకు ఈ సదస్సు ద్వారా 75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అమూల్యమైన సూచనలు ఇచ్చారని చెప్పారు.













