థింక్ ఎడ్యు సదస్సులో మాట్లాడిన జయరామ్ కోమటి
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి టెక్నాలజీ అధిక వినియోగం వల్ల వచ్చే పరిణామాలపై చెన్నైలో జరిగిన ఓ సదస్సులో ప్రసంగించారు. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ ఏర్పాటు చేసిన థింక్ ఎడ్యు కన్క్లేవ్ సదస్సు చెన్నైలో జరిగింది. ఈ సదస్సులో ఎంతోమంది ప్రముఖులు ప్రసంగించారు. అమెరికా నుంచి ఈ సదస్సులో ప్రసంగించేందుకు జయరామ్ కోమటి వచ్చారు. సాంకేతిక వినియోగం అధికంగా వినియోగించడం వల్ల వచ్చే పరిణామాలపై ప్రసంగించారు. టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడితే అనర్థాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. ఎపి జన్మభూమి ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతుల ఏర్పాటు విషయాలను కూడా సదస్సులో తెలియజేశారు. ఈ సదస్సులో తమిళనాడు గవర్నర్, పుదుచ్చేరి గవర్నర్ తదితరులు ప్రసంగించారు.













