ATA: ఆటా అధ్యక్షుడిగా జయంత్ చల్లా ప్రమాణస్వీకారం
 
                                    అమెరికా తెలుగు సంఘం(ATA) అధ్యక్షుడిగా జయంత్ (Jayanth Challa) పదవీబాధ్యతలు చేపట్టారు. లాస్వేగాస్లో జరిగిన సంస్థ కార్యవర్గ సమావేశంలో ఆయన నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. మాజీ అధ్యక్షురాలు మధు బొమ్మినేని నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్కు చెందిన జయంత్ వర్జీనియాలో నివసిస్తున్నారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు.
ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ఆటా తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యాన్ని పెంచడం ఇతర సేవా కార్యక్రమాలు విస్తరించడంపై దృష్టి సారిస్తానని జయంత్ చల్లా పేర్కొన్నారు.











