ఆటా కాన్ఫరెన్స్‌కు రండి… కొలకలూరి ఇనాక్, నరాల రామిరెడ్డికి జయంత్ చల్లా ఆహ్వానం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అమెరికాలో పలు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చినప్పుడు అక్టోబర్ 3న వర్జీనియాలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో డిసెంబర్ 17న జరగనున్న ఆటా డేస్ సాహిత్య కార్యక్రమాల్లో, అలాగే జూన్ లో జరిగే ఆటా కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందిగా పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. అలాగే ప్రముఖ అవధాని నరాల రామారెడ్డి ని కూడా జయంత్ చల్లా హైదరాబాద్ ఆటాడేస్ సాహితీ కార్యక్రమాలకి, అమెరికాలో జరగనున్న ఆటా కన్వెన్షన్ కి ఆహ్వానించారు. ఆటా డేస్ సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు వేణు నక్షత్రం సమక్షంలో ఈ ఆహ్వాన కార్యక్రమం వర్జీనియాలో జరిగింది.













