న్యూయార్క్ లో కాన్సుల్ జనరల్‌ను కలిసిన జే తాళ్ళూరి
ఫేక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి తెలుగు విద్యార్థులను అరెస్టు చేయడం అన్యాయమని, అరెస్టు అయిన విద్యార్థులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఉపాధ్యక్షుడు జే తాళ్ళూరి న్యూయార్క్ కాన్సుల్ జనరల్‌కు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
దీనిపై భారత ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని విద్యార్థులకు తగిన న్యాయం చేసేందుకు క షి చేయాలని కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తిని ఆయన కోరారు. ఇమ్మిగ్రేషన్ అధికారులతో తగు చర్చలు జరిపి సత్వర చర్యలు తీసుకుంటామని సందీప్ హామీనిచ్చినట్లు జయశేఖర్ తెలిపారు. సందీప్‌ను కలిసిన వారిలో సతీష్ పలుకూరి, రాజా కసుకుర్తి తదితరులు కూడా ఉన్నారు.













