ట్రంప్ అసలైన బరువెంతో తెలిస్తే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలైన బరువెంతో తెలిస్తే 100,000 డాలర్లు ఇస్తానని అంటున్నారు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్. ట్రంప్‌కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారంటూ వైద్యులు ప్రకటించారు. ట్రంప్ 6 అడుగుల 3 అంగుళాలు ఉన్నారని ఆయన బరువు 239 పౌండ్లు ఉందని వైద్యులు రోనీ జాక్సన్ తెలిపారు. ట్రంప్ ఆర్యోగ వివరాలు బయటికి రాగానే జేమ్స్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ట్రంప్ ఒప్పుకుంటే ఆయన అసలైన బరువు, ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు నేనే ఓ వైద్యుడిని ఏర్పాటు చేస్తాను. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే 100,000 డాలర్లను ట్రంప్ ఛారిటీకి విరాళంగా ఇస్తాను అని జేమ్స్ ట్వీట్ చేశారు. మైఖెల్ ఊల్ఫ్ అనే వ్యక్తి ట్రంప్ జీవితాధారంగా ఫైర్ అండ్ ప్యూరీ అనే పుస్తకం రాశారు. అందులో ట్రంప్ మానసిక ఆరోగ్యం గురించి వివరించడం చర్చనీయాంశంగా మారింది. దాంతో ట్రంప్ అధ్యక్షుడయ్యాక తొలిసారి ఆయనకు వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు.













