తెలంగాణ కు పోదాం నడువు బిడ్డా – జలగం సుధీర్
సియాటెల్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఈ ఫొటొ కు 3 యెండ్లు (April 24, 2017). ఇక్కడ అమెరికాలో మంచిగున్నది కదా మల్ల మనం ఇండియాకు ఎందుకు వెల్తున్నం అన్న వెదాన్ష్ కి మన తెలంగాణ లో ఇంకా మంచి భవిష్యత్ ఉంటది అని తీసుకువస్తున్న సంధర్భం. అంతకుముందు ఒక సంవత్సరం కిందా కోదాడ మార్కెట్ కమిటి చైర్మన్ పదవి ఇస్తే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ ల మీద, ధరల స్తిరికరణ మీద, ఆహార ఉత్పత్తులకు సంబందించి నిల్వల పరిశోధన మీద రిసేర్చ్ చేయటానికి, రైతులకు సహయం చేయటానికి ఉపయొగించుకుంటానని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చెయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ అధికారి ఒకరు ఫోన్ చేస్తే నా ఉద్యొగానికి రాజినామా చేసి జులై 2016 లో ఇండియా కు రావటం జరిగింది.
ముఖ్యమంత్రి గారు రెవెన్యు, పోలిస్ ఎంక్వైరి కి ఆదెశించి స్థానిక కోదాడ తహసిల్దార్ నుండి రిపోర్ట్ (2016 – అగస్ట్) తెప్పించుకోవటం కూడ జరిగినప్పటికి అప్పటి రాజకీయాల కారణంగా పదవి రాలేదు. 2018 అసెంబ్లి ఎలక్షన్ లలో ఒక పెద్దమనిషి సపోర్ట్ ఇవ్వలేదని పక్కనపెట్టారు.
అప్పటి నుండి నేటి వరకు నా ప్రయాణం మీ అందరికి తెలిసిందే. కొత్త తరం రాజకీయాలకు నాంది పలకాలని ఒక యువనేతకు పదే పదే విజ్ఞప్తి చేస్తునే నేను నా ప్రయత్నాలు మాత్రం విరమించుకోలెదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉండి భవిశ్యత్ రాజకీయాల్లో నాకంటు ఒక ముద్ర వేసుకుంటానా, లేదా ఇష్యు బేస్డ్ పాలిటిక్స్ అన్నది ప్రజలకు మంచి చేస్తదా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
సహకరించిన ప్రతి ఒక్కరికి హ్రుదయపూర్వక ధన్యవాదములు. నిరంతరం నన్ను వేదిస్తు, అవమానపరుస్తు, ఎగతాళి చేస్తు నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న మరికొంతమంది విమర్శకులకు ప్రత్యేక క్రుతజ్ఞతలు. ప్రశ్న అడిగిన వేదాన్ష్ కి మంచి సౌకర్యాలు కల్పించటం లో ఫెయిల్ అవుతున్న బాధ ఉన్నప్పటికి అనేకమంది కి సహయం చేయటం లో ఉన్న సంత్రుప్తి తో కాలం వెల్లదీస్తున్నాము.













