కరోనాపై జలగం సుధీర్ కవిత

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్ సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనే వ్యక్తి. అమెరికాలో ఉన్నత ఉద్యోగం వదులుకుని సొంతూరికి ఏదైనా చేయాలన్న తపనతో అమెరికా నుంచి కోదాడకు తిరిగి వచ్చారు. అమెరికాలో ఉన్నప్పుడే బడికోసం, ఆసుపత్రిలో మార్పుకోసం ఆన్‍లైన్‍లో పోరాటం చేశారు. ప్రభుత్వ స్కూల్ అభివృద్ధికోసం టీ విత్ హెడ్‍మాస్టర్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలతో అందరిదృష్టిని ఆకర్షిస్తున్న ఆయన కరోనా మహమ్మారిపై ప్రత్యేక కవితను రాశారు.
కరోనా ..
నీ అడుగు మానవాళి మంచికేనా
మరచిన బంధానికి మనమందరం ఒక్కటే అని చెప్పడానికేనా
మాయమైన మనిషికి ప్రాణం పోయడానికేనా
కనకపు సింహాసనమైనా నీ ముందు దిగదుడుపేనా
చీదరించిన వ్రుత్తులకు కాళ్ళు కడిగించటానికేనా
కరోనా
ఆకలికి అల్లడే జనానికి ఆదుకునేటొల్లు ఎవరో చెప్పటానికేనా
పశు పక్ష్యాదులకు కాసింత విశ్రాంతివ్వటానికేనా
రియల్ ఎస్టేటుకే మట్టి మనషుల వాసన చెప్పటానికేనా
కులం, మతం మాటున దాగిన ఘోరాలు చెప్పటానికేనా
బతికుంటె చాలు బలుసాకు విలువేందొ చెప్పటానికేనా
కరోనా
బతికున్న పెళ్ళం కష్టమెందో కండ్ల ముందు చూపటానికెనా
మగవాడిననే అహంకారం అణిచివేసెందుకేనా
అత్తైన, అమ్మైన ఒక్కటే అన్న నిజం చెప్పటానికేనా
కలిసుంటె కలదు సుఖం అని ఆలొచన చేసెందుకా
పిల్లల అల్లరి, పెద్దల ఆప్యాయతలు రుచి చూపించటానికేనా
కరొనా
నీ అడుగు మానవాళి మంచికేనా
– జలగం సుధీర్, కోదాడ