Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)

మొట్టమొదటిసారి 1999-2000 సంవత్సరం లో అమెరికా వీసా అప్లై చేసినప్పటి నుండి నేటివరకు సుమారు 10 సార్లు H1b అప్లై చేసి ఉంటాను. ఒకసారి బిజినెస్ విసా (B1/B2) కూడ వచ్చింది. వీసాల విషయం లో ఇబ్బంది అనుకున్నపుడు పునే, బెంగళురు, చెన్నై, హైద్రాబాద్ లలో కూడ పనిచేసాను.
కెనడా పర్మినెంట్ రెసిడెంట్ (PR Card), కెనడా విజిట్ విసా, కెనడా వర్క్ వీసా, ఇంగ్లాండ్ వర్క్ పర్మిట్, ఇంగ్లాండ్ బిజినెస్ విసా, ఇంగ్లాండ్ వర్కింగ్ హాలిడే మేకర్ వీసా ఇలా అనేక వీసాలు రావటం మరియు అయా దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితం లో సమాజ సేవ, రాజకీయం అంటూ మధ్యలో ఇండియాలో కొంతకాలం గడిపాను.
2001-02 సమయం లో కొంత ఇబ్బందికర పరిస్తితి ఉన్నపుడు ఒక అమెరికన్ అధికారి ధైర్యం చెబుతూ ప్రపంచం చాల పెద్దది మీరు మీ నైపుణ్యం పెంచుకుంటు వెల్తూ ఉండండి అవకాశాలు అవే వస్తాయి అని చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది.
పత్రికల్లో వార్తలు చూసి కంగారు పడాల్సిన పనిలేదు. నిజంగా మనం పని చేయదల్చుకుంటే మన దేశం తో సహ పలు ఇతర దేశాల్లో సాంకేతిక నిపుణుల అవసరం ఉంది.
(-జలగం సుధీర్, అస్టిన్, అమెరికా)