అమెరికాలో ఘనంగా ఏపీ సీఎం జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలోని మెంఫిస్‌లో ఘనంగా జరిగాయి. మెంఫిస్‌లోని హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్లో అక్కడి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు డిసెంబర్ 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్‌ను కట్ చేశారు. ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రబోతుల శ్రీనివాసరెడ్డి, రాజశేఖరరెడ్డి, వెంకట్ తమ్మ, వీరమోహన్‌రెడ్డి, సూర్య, రమేశ్, రామ్, విజయ్, జయ్‌పాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రామకృష్ణ, తెలుగు అసోసియేషన్ కమిటీ సభ్యులు కిరణ్ పారపూడి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.













