కరోనాకు మందు కనిపెడితే రూ.కోటి ఇస్తా
కరోనా వైరస్ ఇప్పటికే సుమారు వెయ్యిమంది ప్రాణాలను హరించి వేసింది. వేలమంది బాధితులు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు తీవ్రస్థాయిలో పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పరిశోధన కోసం పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా, ప్రముఖ నటుడు జాకీచాన్ కూడా ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వుహాన్ నగరంలో కరోనా నిరోధక మాస్కలు, ఇతర సామాగ్రి అందజేస్తున్నారు. అంతేకాదు, కరోనా వైరస్‌కు మందు కనిపెడితే కోటి రూపాయు ఇస్తానని ప్రకటించారు. తన నగదు బహుమతి శాస్త్రవేత్తలను మరింత ప్రోత్సహిస్తుందని భావిస్తున్నట్లు జాకీ చాన్ అభిప్రాయపడ్డారు.













