చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌజ్ టాప్ సలహాదారు ఇవాంక ట్రంప్, గత ఏడాది తన వ్యక్తిగత ఖాతా నుంచి వందలాది ఇ మెయిళ్లు పంపినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. పబ్లిక్ రికార్డుల నిబంధనలు ఉల్లంఘించిన వైట్‌హౌజ్ సహాయకులు, కేబినెట్ సభ్యులు, తన సహాయకులకు ఆమె ఇమెయిళ్లను పంపినట్లు పేర్కొంది. ఇ మెయిళ్ల వినియోగం గురించి వైట్‌హౌజ్ నుంచి స్పందనలేదు. ఈ అంశాన్ని వివాదాస్పదం చేయొద్దని ఇవాంకా న్యాయవాది, ప్రతినిధి అబ్బె లోవెల్ పేర్కొన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని మార్పు చేసేటప్పుడు మిస్ ట్రంప్ కొన్నిసార్లు తన వ్యక్తిగత ఖాతాను వినియోగించినట్టు ప్రతినిధి పీటర్ మిర్జానియన్ తెలిపారు. సందేశాలలో వర్గీకృత సమాచారం పంపలేదని ఆయన నొక్కి చెప్పారు. ఇ మెయిళ్లను తొలగించలేదని, న్యాయ నిబంధనలతో సరిచూసేందుకు వాటిని అలాగే ఉంచినట్లు మిరిజానియన్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన 14 నెలల క్రితం పత్రికల్లో వచ్చినప్పుడు వైట్‌హౌజ్ కౌన్సిల్‌తో కలిసి తన ఇ మెయిళ్లను ఆమె సమీక్షించారని, సమస్యను కాంగ్రెస్ నేతలకు వివరించినట్లు ఆయన తెలిపారు.













